Ravana Temple: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.! అదే రోజు రావణుడి ఆలయంలోకి సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ.
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నొయిడా సమీపంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి బిస్రఖ్ గ్రామంలో రావణుడిని ఆరాధించే ఓ పురాతన శివాలయంలో స్థానికులు సీతారాముడు, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నొయిడా సమీపంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి బిస్రఖ్ గ్రామంలో రావణుడిని ఆరాధించే ఓ పురాతన శివాలయంలో స్థానికులు సీతారాముడు, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ నివసించేవారు అనాదిగా రావణాసురుడిని పూజిస్తున్నారు. రావణుడి తండ్రి విశ్రవసుడి జన్మస్థలం ఇదేనని, రావణుడు తమ పూర్వీకుడని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. అందుకే విజయదశమికి రావణుడి బొమ్మను దహనం చేసే సంప్రదాయం కూడా తాము పాటించమని వారు చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడి తాత పులస్త్యముని ప్రతిష్ఠించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇక్కడ రావణుడి విగ్రహం లేకపోయినా, గోడలపై రావణుడి జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే చిత్రాలను ముద్రించారు. వచ్చే విజయ దశమికి రాముడి విగ్రహం పక్కనే రావణుడి ప్రతిమను ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇద్దరికీ కలిపి పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

