Republic Day 2024: ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్.. ఆర్మీ హెలికాప్టర్ల విన్యాసాల వీడియో చూశారా – Watch Video
Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిడే డే వేడుకలకు ముస్తాబవుతోంది. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నిర్వహించారు. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు సైనికులు కవాతు నిర్వహించారు. యుద్ధ ట్యాంకులను ప్రదర్శించారు. ఆకాశంలో హెలికాప్టర్ల విన్యాసాలు, పదాతిదళ ప్రదర్శనలు అలరించాయి.
దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిడే డే వేడుకలకు ముస్తాబవుతోంది. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నిర్వహించారు. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు సైనికులు కవాతు నిర్వహించారు. యుద్ధ ట్యాంకులను ప్రదర్శించారు. ఆకాశంలో హెలికాప్టర్ల విన్యాసాలు, పదాతిదళ ప్రదర్శనలు అలరించాయి. త్రివిధ దళాల కవాతు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బయో ఇంధనంతో ఉన్న విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. ఆ విన్యాసాలు అదరహో అనిపించాయి. ఇక ఆకాష్ యుద్ధ నౌకల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిపబ్లిక్ డే పరేడ్ కోసం వివిధ శకటాలు రెడీ అవుతున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Published on: Jan 24, 2024 06:09 PM
వైరల్ వీడియోలు
Latest Videos