School Teacher Missing: స్కూల్ కు వెళ్లిన వెళ్లిన టీచర్ శవమై వచ్చింది.! అసలేం జరిగింది.?
స్కూల్ కు వెళ్లి అదృశ్యమైన టీచర్ చివరకు శవమై కనిపించింది. జనవరి 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఈ ఉపాధ్యాయురాలిని హత్యచేసి ఓ ఖాళీ ప్రదేశంలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీచర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దారుణ ఘటన కర్నాటక మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాండవపూర్ మాణిక్యహళ్లికి చెందిన 28 ఏళ్ల దీపిక ఓ ప్రైవేట్ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
స్కూల్ కు వెళ్లి అదృశ్యమైన టీచర్ చివరకు శవమై కనిపించింది. జనవరి 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఈ ఉపాధ్యాయురాలిని హత్యచేసి ఓ ఖాళీ ప్రదేశంలో పూడ్చి పెట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీచర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దారుణ ఘటన కర్నాటక మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాండవపూర్ మాణిక్యహళ్లికి చెందిన 28 ఏళ్ల దీపిక ఓ ప్రైవేట్ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈమెకు భర్త లోకేష్, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. మృతురాలు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె- ఎంతకీ ఇంటికి చేరలేదు. ఆమె కనిపించడం లేదని లోకేశ్, మృతురాలి తల్లిదండ్రులు మేలుకోటె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్పీ యతీశ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మేలుకోటె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు సోమవారం సాయంత్రం మేలుకోటే కొండ దిగువన దీపిక మృతదేహం లభ్యమైంది. దీపికను ఎవరో హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పాండవాపూర్ తాళ్లూరు ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

