చికెన్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే అరకేజీ చికెన్.. కండిషన్స్‌ అప్లై

Updated on: Nov 25, 2025 | 5:48 PM

విజయనగరం జిల్లా రాజాంలోని చికెన్ షాప్ యజమాని రూపాయి నోటుకు అరకేజీ చికెన్ ఆఫర్‌ను ప్రకటించారు. కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరగడంతో ఈ వినూత్న ఆలోచన చేశానని యజమాని తెలిపారు. ఈ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం షాప్ వద్ద క్యూ కట్టారు. అయితే, ప్రస్తుతం రూపాయి నోటు దొరకడం కష్టంగా మారడంతో ఆశించినంత స్పందన రాలేదని, నోటు విలువపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఓ చికెన్ షాప్ యజమానికి వచ్చిన వినూత్న ఆలోచన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా తగ్గింపు ధరలు, ఆఫర్లు పెట్టడం సాధారణ విషయమే. కానీ రాజాంలోని ఆ చికెన్ షాప్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకునేలా రూపాయి నోటు తీసుకువస్తే అరకేజీ చికెన్ ఇస్తామనే ఆఫర్‌ను ప్రకటించింది. అలా ప్రచారం మొదలైన కొద్ది గంటలలోనే ఈ ఆఫర్ పట్టణంలో చర్చనీయాంశమైంది. కేవలం ఒక రూపాయి నోటు తీసుకువస్తే సరిపోతుందని తెలిసిన ప్రజలు పెద్దఎత్తున షాప్ వద్దకు తరలివచ్చారు. కొంతమంది సరదాగా వస్తే, మరికొందరు నిజంగానే ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వచ్చారు. షాప్ ముందర యువత, మహిళలు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. ఒక్కరోజులోనే షాప్ వద్ద కస్టమర్స్ రద్దీ పెరిగింది. గతంలో కూడా ఈ వ్యాపారి అనేక ఆఫర్లు పెట్టి స్థానికంగా అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ ఆఫర్ వైరల్ కావడంతో మరింత మంది ఆసక్తి చూపారు. కార్తీకమాసం సందర్భంగా పెరిగిన కూరగాయ ధరల వలనే.. తాను ఈ ఆఫర్ పెట్టినట్లు షాపు యజమాని ప్రకటించారు. ఈ ఆఫర్ కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఆఫర్ ను వినియోగించుకోవాలని తెలియజేశారు. అయితే ఈ రోజుల్లో రూపాయి నోటు దొరకడం సహజంగానే కష్టం కావడంతో పరిమితంగానే రూపాయి నోటుతో కస్టమర్లు వచ్చారని, గతంలో మాదిరిగా ఆశించిన స్థాయిలో రాలేదని షాపు యజమాని తెలిపారు. అయితే..రూపాయి నోటు వల్ల ఏదో పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టే.. ఈ ఆఫర్ పెట్టారని, రాబోయే రోజుల్లో ఆ నోటుకు మరింత విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది ఈసారి ముందుకు రాలేదని స్థానికులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్పత్రిలో డాక్టర్‌ డ్యాన్స్‌.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్‌

అక్కడి ట్రాఫిక్‌ను దాటడం కంటే.. అంతరిక్షానికి వెళ్లడం ఈజీ

ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్లాంచీలో సాగర్ – శ్రీశైలం లాహిరి లాహిరి

రాత్రి ఘనంగా పెళ్లి… తెల్లారేసరికి కనిపించకుండా పోయిన పెళ్లికూతురు

ఆలయ వసతి గృహానికి అనుకోని అతిథి.. ఆ తర్వాత