హైదరాబాదీలూ బీ అలెర్ట్ !! ఆ పాలు తాగుతున్నారా ??

|

Dec 21, 2023 | 12:19 PM

యాదాద్రి జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో వేలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వందలాది మంది ఈ పాల వ్యాపారం మీదనే ఆధారపడ్డారు. హైదరాబాద్ కు అతి సమీపాన ఉండడంతో నిత్యం లక్షలాది లీటర్ల పాలు ఎగుమతి అవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ పాలను కల్తీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో విచ్చలవిడిగా కల్తీపాల తయారీ జరుగుతోంది.

యాదాద్రి జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో వేలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వందలాది మంది ఈ పాల వ్యాపారం మీదనే ఆధారపడ్డారు. హైదరాబాద్ కు అతి సమీపాన ఉండడంతో నిత్యం లక్షలాది లీటర్ల పాలు ఎగుమతి అవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ పాలను కల్తీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో విచ్చలవిడిగా కల్తీపాల తయారీ జరుగుతోంది. ప్రధానంగా బొమ్మలరామారం, బీబీనగర్‌, భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో ఈ దందా కొనసాగుతోంది. ఆరోగ్యాన్ని ఇచ్చే స్వచ్ఛమైన పాలను కొందరు కల్తీ కేటుగాళ్లు విషంగా మారుస్తున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం కల్తీ పాల తయారీపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్‌, యాదాద్రి భువనగిరి జోన్‌ ఎస్‌ఓటీ పోలీసుల నిర్వహించిన దాడుల్లో దాదాపు 13 చోట్ల అక్రమాలు బయట పడ్డాయి. గతంలో అనేక సార్లు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కల్తీ పాలను గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్మిక డీప్ ఫేక్ వీడియో.. నలుగురు అరెస్ట్

Pallavi Prashanth: పోలీసులకు దొరకకుండా పారిపోయిన రైతుబిడ్డ

Rishab Shetty: గ్రేట్ !! రియల్‌ హీరో అనిపించుకున్న రిషబ్

Shruti Haasan: రోజూ మందు పార్టీ.. తప్పుచేశానంటూ బాధపడ్డ శృతి

Pallavi Prashanth: నేనూ మనిషినే.. ఎందుకిట్ల చేస్తుండ్రు.. గరం అయిన రైతుబిడ్డ