కొడుకు సమాధిపై క్యూ ఆర్ కోడ్ !! ఆ తండ్రి చేసిన పనికి..
ఆశలన్నీ కన్నబిడ్డలపైనే పెట్టుకుని పెంచుతారు తల్లిదండ్రులు.. ఆ బిడ్డలు జీవితంలో ఎదుగుతుంటే చూసి పొంగిపోతారు. అలాంటి బిడ్డలు కళ్లముందే కాలం తీరకుండా..
ఆశలన్నీ కన్నబిడ్డలపైనే పెట్టుకుని పెంచుతారు తల్లిదండ్రులు.. ఆ బిడ్డలు జీవితంలో ఎదుగుతుంటే చూసి పొంగిపోతారు. అలాంటి బిడ్డలు కళ్లముందే కాలం తీరకుండా.. అకారణంగా మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది. వారి జ్ఞాపకాల్లోంచి బయటకు రావడం కష్టసాధ్యం. కేరళకు చెందిన ఓ వ్యక్తి అకాల మరణం చెందిన తన కుమారుడి జ్ఞాపకాలను టెక్నాలజీ సహాయంతో పదిలపరచుకున్నాడు.. తన కొడుకు ఆదర్శవంతమైన జీవితం అందరికీ స్పూర్తివంతం కావాలనే సదుద్దేశంతో అతని జీవితాన్ని వెబ్ పేజీద్వారా ప్రపంచానికి అందించాడు. కొడుకు సమాధిపై క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి ఆ వెబ్ పేజీకి అనుసంధానం చేశాడు. కేరళకు చెందిన డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే యువకుడు వైద్యునిగా పనిచేసేవాడు. రెండేళ్ల క్రితం సరదాగా బాడ్మింటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. కానీ వైద్యునిగా అతని సృజనాత్మకత మాత్రం సజీవంగా ఉండిపోయింది. ఇవిన్ తల్లిదండ్రులు త్రిసూర్‌లోని చర్చి వద్ద తమ కుమారుడి సమాధి రాయిపై ఓ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా
రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి !!