Punjab Train Accident: నిద్రపోయిన లోకో పైలట్లు.. ఆ రైలు ప్రమాదానికి కారణమిదే.!

పంజాబ్‌లో ఇటీవల గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు తెలిసాయి. దర్యాప్తు చేసిన అధికారులు.. ప్రమాదానికి డ్రైవర్ల తప్పిదమే కారణమని తేల్చారు. లోకో పైలట్‌తో సహా అసిస్టెంట్‌ కూడా కునుకుతీశారని, ఈ క్రమంలో రెడ్‌ సిగ్నల్‌ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్థారించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.

Punjab Train Accident: నిద్రపోయిన లోకో పైలట్లు.. ఆ రైలు ప్రమాదానికి కారణమిదే.!

|

Updated on: Jun 09, 2024 | 2:46 PM

పంజాబ్‌లో ఇటీవల గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో కీలక విషయాలు తెలిసాయి. దర్యాప్తు చేసిన అధికారులు.. ప్రమాదానికి డ్రైవర్ల తప్పిదమే కారణమని తేల్చారు. లోకో పైలట్‌తో సహా అసిస్టెంట్‌ కూడా కునుకుతీశారని, ఈ క్రమంలో రెడ్‌ సిగ్నల్‌ పడినా బ్రేకులు వేయకపోయినట్లు నిర్థారించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని.. ఈ విషయాన్ని రైలు డ్రైవర్లు కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. పంజాబ్‌లోని సర్హింద్‌ జంక్షన్‌, సాధూగఢ్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య జూన్‌ 2 తెల్లవారుజామున 3.15 గంటలకు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. పక్కన ఉన్న మెయిన్‌ ప్యాసింజర్‌ లైన్‌పై గూడ్స్‌ ఇంజిన్‌ పడిపోయింది. అదే సమయంలో మరో లైనులో జమ్మూ తావీ స్పెషల్‌ రైలు అటుగా వచ్చింది. ఆ ట్రాక్‌ దగ్గర్లో పడివున్న గూడ్స్‌ ఇంజిన్‌ను ఢీకొట్టడంతో జమ్మూ రైలు ఇంజిన్‌ కూడా పట్టాలు తప్పింది. ఆ సమయంలో జమ్మూ తావీ రైలు నెమ్మదిగా గంటకు 46 కి.మీ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

అందువల్లే భారీ ప్రమాదం తప్పిందని, వందలాది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తాజా నివేదిక బయటపెట్టింది. ప్రమాదంలో గూడ్సు రైలు లోకో పైలట్‌, అసిస్టెంట్‌లు ఇంజిన్‌లో ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని అతికష్టం మీద బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ప్రమాద సమయంలో తాము నిద్రపోయినట్లు ఇద్దరు డ్రైవర్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వేశాఖ వెల్లడించింది. అయితే, డ్రైవర్ల కొరత కారణంగా తాము అదనపు సమయంలో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!