PHD Sabjiwala: పీహెచ్‌డీ., 4 పీజీలు.. అయినా వీధుల్లో కూరగాయల అమ్మకం.! ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’.
పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఢిల్లీలో ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 39 ఏళ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌డీ అందుకున్నారు. సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో వైరల్‌గా మారాయి. తన కూరగాయల బండికి ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు.
పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఢిల్లీలో ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 39 ఏళ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌డీ అందుకున్నారు. సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో వైరల్‌గా మారాయి. తన కూరగాయల బండికి ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు. సందీప్ సింగ్ తొలుత పంజాబ్ యూనివర్సిటీ లా విభాగంలో 11 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే జర్నలిజం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేశారు. అయితే సమయానికి వేతనాలు సరిగా రాకపోవటం, అందులో కోతలు విధించటంతో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని అతడు వదిలేయాల్సి వచ్చిందట. ‘వేతనం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నానని సందీప్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే టీచింగ్‌పై ఉన్న మక్కువ పోలేదని, కొంత డబ్బు పొదుపు చేసి.. ఏదో ఒక రోజు ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తానని తన ఆకాంక్షను బయటపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.