Andhra Pradesh: వజ్రాలు కావాలా..? అయితే ఆ ఊరెళ్లండి.! వజ్రాలు దొరికుతున్నాయని ప్రచారం..

Andhra Pradesh: వజ్రాలు కావాలా..? అయితే ఆ ఊరెళ్లండి.! వజ్రాలు దొరికుతున్నాయని ప్రచారం..

Anil kumar poka

|

Updated on: Jul 19, 2023 | 8:24 AM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తాజాగా వజ్రాల వేట కొనసాగుతుంది. బసవమ్మ వాగు దగ్గర ప్లాట్ల కోసం పోసిన మట్టిలో వజ్రాల కోసం జనం వెతుకుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. గతంలో బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే కోహినూర్ వజ్రం దొరికిందని నానుడి.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో తాజాగా వజ్రాల వేట కొనసాగుతుంది. బసవమ్మ వాగు దగ్గర ప్లాట్ల కోసం పోసిన మట్టిలో వజ్రాల కోసం జనం వెతుకుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. గతంలో బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే కోహినూర్ వజ్రం దొరికిందని నానుడి. కృష్ణా నది తీరంలో ఉండే ఈ గ్రామం ప్రస్తుతం పులిచింతల బ్యాక్ వాటర్ లో మునిగి పోయింది. గతంలో ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాగేది. తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్ళూరు వెళ్ళి కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారు.

కోహినూర్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై ఒక కథ కూడా స్ధానికంగా ప్రచారంలో ఉండేది. బెల్లంకొండ ప్రాంతాన్ని పాలించే రాజు వద్దకు అతి పెద్దదైన వజ్రాన్ని స్థానికులు తీసుకొచ్చారని దాన్ని స్థానికంగా ఉన్న రాజు ముస్లిం రాజు వద్దకు తీసుకెళ్ళగా దాన్ని చూసిన ముస్లిం రాజు ఆశ్చర్యంతో కోయి నహీ నూర్ అన్నాడని తర్వాత కాలంలో అదే కోహినూర్ అయిందని చెప్పుకునేవారు. అలా ముస్లిం రాజుల వద్దకు చేరిన కోహినూర్ బ్రిటీష్ పాలకులు సమయంలో చేరిందని చెప్పుకుంటుంటారు. ఈ నేపధ్యంలోనే కోళ్ళూరు పులి చింతల బ్యాక్ వాటర్ లో మునిగి పోయేంత వరకూ వజ్రాల వేట కొనసాగేది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...