Viral: పది దాటితే పెళ్లిళ్ళు బంద్.. ఎనిమిదిన్నరకు దుకాణాలు క్లోజ్.. ఎందుకో తెలుసా..?
రాత్రి పది దాటితే పెళ్ళి వేడుకలకు బంద్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. రాత్రి ఎనిమిదిన్నర కల్లా దుకాణాలు, మార్కెట్లను కూడా బంద్ చేయాలని వ్యాపారుల్ని ఆదేశించింది. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
రాత్రి పది దాటితే పెళ్ళి వేడుకలకు బంద్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. రాత్రి ఎనిమిదిన్నర కల్లా దుకాణాలు, మార్కెట్లను కూడా బంద్ చేయాలని వ్యాపారుల్ని ఆదేశించింది. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్… కరెంటు ఆదాకు ఈ చర్యలు చేపట్టింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వాన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇస్లామాబాద్‌లో బుధవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయని జియో న్యూస్ తెలిపింది. దేశంలో 22 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, డిమాండ్ 26 వేల మెగావాట్ల మేర ఉంటోందని విద్యుత్‌శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్ పేర్కొన్నారు.మరోవైపు, పాకిస్థాన్‌లో పెట్రోల్ కష్టాలు పెరిగాయి. చమురు, గ్యాస్ కొనుగోలు చేసేందుకు తమ వద్ద తగినన్ని నిధులు లేవని ప్రధాని షరీఫ్ చెప్పారు. ఈ క్రమంలోనే.. ఇంధన ధరలను పెంచక తప్పడంలేదని ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ తెలిపారు. దీంతో ప్రజలు పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీశారు. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం పెద్ద సంఖ్యలో జనం బారులుతీరి కనిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!