Pizza on Volcano: ప్రపంచంలో రకరకాల కొత్త ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి అయితే, మరికొన్ని ప్రజల మనసుల్ని గెలుచుకునే వ్యాపారం చేయడం కోసం ఉంటాయి. కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు చేసి.. వాటి ద్వారా తమ ఉత్పత్తులను మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అటువంటి వాడే 34 ఏళ్ల డేవిడ్ గార్సియా. అయితే, ఇతను చేసిన పని అత్యంత రిస్క్ తో నిండినది. సాధారణంగా ఎవరూ అటువంటి ఆలోచన చేయడానికే సాహసించరు. ఇంతకీ ఈయన ఏం చేశారంటే.. నిత్యం వేడితో.. ఎప్పుడు పగిలి బయటకు ఉరుకుదామా అని చూస్తూ ఉండే లావాను నింపుకున్న అగ్నిపర్వతం పైన ఆ లావా వేడిలో పిజ్జాలు కాల్చాడు. ఎంత వ్యాపారం కోసం అయితే, మాత్రం అంత రిస్క్ అవసరమా అని మీరనుకోవద్దు. ముందే చెప్పుకున్నాం కదా.. కొందరు అటువంటి కొత్తదనమే కోరుకుంటారు.
గ్వాటేమేలాలోని పకాయ అగ్ని పర్వతం పై డేవిడ్ గార్సియా ఈ పిజ్జాలు చేశాడు. వీటికి పకయా పిజ్జలని పేరుపెట్టాడు. దీనికోసం అతను ప్రత్యెక లోహపు పలకలు ఉపయోగించారు. అవి 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. అదేవిధంగా ఇతను కూడా వేడి నుంచి రక్షణ పొందగలిగే దుస్తులను ధరించాడు. ఈ ఫోటోలను అతను సోషల్ మీడియాలో ఉంచారు. అవి ట్రెండింగ్ లో ఉన్నాయి. అంతే కాదు గార్సియాను అక్కడ పిజ్జాలు చేస్తుంటే చూడటానికి, అగ్నిపర్వతం మీద తయారు చేసిన పిజ్జాతో పోజులివ్వడానికి అనేక మంది పర్యాటకులు అగ్నిపర్వత ప్రదేశానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్నిపర్వతం పై పిజ్జా తయారు చేసి వచ్చిన తరువాత కిందికి వచ్చిన గార్సియా..”నేను ఈ పిజ్జను సుమారు 800 డిగ్రీల వేడి గుహలో ఉంచాను. అది 14 నిమిషాల్లో సిద్ధం అయి బయటకు వచ్చింది.” అని చెప్పారు. అంతేకాదు దీనిని తిన్నవాళ్ళు ఈ పిజ్జా అగ్నిపర్వతం నుండి బయటకు రావడంతో చాలా అద్బుతమైన రుచితో ఉంది అని చెప్పారు.
పిజ్జా తయారైన వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు..
VIDEO: ???? In an improvised kitchen among volcanic rocks, David Garcia stretches his dough and selects ingredients for a #pizza destined for a rather unusual oven: a river of lava that flows from the Pacaya #volcano in Guatemala pic.twitter.com/wVmnnl61Ib
— AFP News Agency (@AFP) May 12, 2021
ఫిబ్రవరి నుండి పకాయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతోంది. స్థానిక సంఘాలు, అధికారులను అధిక అప్రమత్తతో ఉన్నారు. ఈ క్రియాశీల అగ్నిపర్వత సముదాయం మొదట సుమారు 23,000 సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందింది. స్పానిష్ గ్వాటెమాల ఇప్పటివరకూ కనీసం 23 సార్లు విస్ఫోటనం చెందింది.
Corona Virus: ఆఖరు నిమిషాల్లో… పాట పాడి అమ్మకు గుడ్ బై… ( వీడియో )