Pulasa Curry: భలే ఛాన్స్‌లే.. పులస చేపలతో విందు.! ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

Pulasa Curry: భలే ఛాన్స్‌లే.. పులస చేపలతో విందు.! ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

Anil kumar poka

|

Updated on: Jul 31, 2024 | 9:47 AM

పుస్తెలమ్మి అయినా పులస కూర తినాలి అంటారు. అలాంటిది పులసతో విందు ఏర్పాటు చేస్తే... భలే ఛాన్స్‌ కదా... కోనసీమలో ప్రసిద్ధి చెందిన పులస చేపతో కొందరు విందు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లో ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా పులసతో విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు,

పుస్తెలమ్మి అయినా పులస కూర తినాలి అంటారు. అలాంటిది పులసతో విందు ఏర్పాటు చేస్తే… భలే ఛాన్స్‌ కదా… కోనసీమలో ప్రసిద్ధి చెందిన పులస చేపతో కొందరు విందు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లో ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా పులసతో విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, ఇతర జిల్లాల నుండి వచ్చిన ఫోటో వీడియో గ్రాఫర్లు అందరికి రకరకాల చికెన్, మటన్ వంటకాలతో పులసతో భోజనం పెట్టి ఔరా అనిపించారు. కోనసీమలోనే.. అది కూడా వరదల సమయంలో మాత్రమే దొరికే అత్యంత అరుదైన, ఖరీదైన పులస చేపతో భోజనం పెట్టడంతో కార్యక్రమానికి వచ్చిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరదలు ఎక్కువగా ఉండటంతో పులస అర కొరగా మాత్రమే దొరుకుతున్న ఈ సమయంలో వందలాదిమంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కోనసీమ వాసులకు మించిన వారు ఎవ్వరు లేరని మరోసారి నిరూపించారంటూ ఆనందంగా లొట్టలేసుకుంటూ మరీ ఆరగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.