మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూపులు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూపులు.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Phani CH

|

Updated on: Oct 27, 2023 | 2:09 PM

విశ్వాసంలో కుక్కను మించిన జంతువు మరొకటి ఉండదు. మనుషులు కూడా దీని విశ్వాసం ముందు తీసికట్టు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ సిటీలోని MCU హాస్పిటల్ మార్చురీ ముందు ఓ శునకం రోజుల తరబడి పడిగాపులు కాస్తోంది.. కోవిడ్‌తో మరణించిన తన యజమాని కోసం మార్చురీ ముందే ఎదురు చూస్తోంది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది, చదువుతున్న విద్యార్థులు ఆ కుక్కకు మోర్గాన్ అని పేరు పెట్టారు.

విశ్వాసంలో కుక్కను మించిన జంతువు మరొకటి ఉండదు. మనుషులు కూడా దీని విశ్వాసం ముందు తీసికట్టు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ సిటీలోని MCU హాస్పిటల్ మార్చురీ ముందు ఓ శునకం రోజుల తరబడి పడిగాపులు కాస్తోంది.. కోవిడ్‌తో మరణించిన తన యజమాని కోసం మార్చురీ ముందే ఎదురు చూస్తోంది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది, చదువుతున్న విద్యార్థులు ఆ కుక్కకు మోర్గాన్ అని పేరు పెట్టారు. మోర్గాన్ యజమాని కోవిడ్‌తో అదే ఆసుపత్రిలో చేరి చనిపోగా, అతని డెడ్‌బాడీని మార్చురీలో ఉంచారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి ఏడాది గడిచింది. తన యజమాని చనిపోయాడని మోర్గాన్‌కు అర్థం కాలేదు. అది చివరి సారిగా తన యజమానిని ఆస్పత్రి మార్చురీ ప్రాంగణంలోనే చూసింది. దాంతో అతడు అందులోనే ఉన్నాడని తిరిగి వస్తాడని..అక్కడే కాచుకొని ఉంటోంది. ఏడాది కాలంగా ఈ కుక్క అలా మార్చురీముందు ఎదురుచూస్తూనే ఉందని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది, స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Eluru Agency: అరకు అందాలతో పోటీపడుతున్న ఏలూరు ఏజెన్సీ

భారత్‌లో త్వరలో స్కై బస్సు సర్వీసులు !! గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం

10 నిమిషాల్లో పెళ్లి… పెళ్లి వద్దంటూ 100 కి డయల్ చేసిన వరుడు !!

Skanda OTT: బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా

Amala Paul: పబ్ లో ప్రపోజల్.. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న అమలాపాల్