Thailand: మంటల్లో పడవ.! సముద్రంలో దూకేసిన ప్రయాణికులు.. వీడియో.
థాయ్‌లాండ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బోటులో 108 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. సూరత్ థాని ప్రావిన్సు నుంచి పర్యాటక ప్రాంతం కో తావోకు చేరుకుంటుండగా గురువారం ఫెర్రీలో మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రంతా ప్రయాణించిన ఫెర్రీ ఉదయం పర్యాటక ప్రాంతం తావోకు చేరుకోబోతుండగా అగ్ని ప్రమాదానికి లోనైంది. ముందుగా పెద్ద శబ్దం వినిపించిందని ఆ తర్వాత కాలిన వాసన వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
థాయ్‌లాండ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బోటులో 108 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారు. సూరత్ థాని ప్రావిన్సు నుంచి పర్యాటక ప్రాంతం కో తావోకు చేరుకుంటుండగా గురువారం ఫెర్రీలో మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రంతా ప్రయాణించిన ఫెర్రీ ఉదయం పర్యాటక ప్రాంతం తావోకు చేరుకోబోతుండగా అగ్ని ప్రమాదానికి లోనైంది. ముందుగా పెద్ద శబ్దం వినిపించిందని ఆ తర్వాత కాలిన వాసన వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. చూస్తుండగానే మంటల్లో ఫెర్రీ బోటు దగ్ధం కావడం పొగలు రావడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. చేసేదేం లేక అప్రమత్తమైన ప్రయాణికులు లైఫ్ జాకెట్లు తొడుక్కని సముద్రంలోకి దూకేశారు. ఫెర్రీ బోటు ప్రమాదానికి గురైన దాదాపు 20 నిమిషాల తర్వాత స్థానిక అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఫెర్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏంటనే విషయం దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీ తగలబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.