సంతలో మిర్చి బజ్జీలు కొనుక్కుని ఇంటికెళ్లారు.. ఆపై లొట్టలేసుకుంటూ తినగా !!
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంతలో అమ్ముతున్న మిర్చి, ఉల్లి బజ్జీలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లిన కొందరు.. వాటిని లోట్టలేసుకుని తినగా.. చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చేరారు. వివరాలు చూసినట్లయితే.. స్థానిక తిర్యానీ మండల కేంద్రంలో ప్రతీ శుక్రవారం సంత జరుగుతుంది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంతలో అమ్ముతున్న మిర్చి, ఉల్లి బజ్జీలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లిన కొందరు.. వాటిని లోట్టలేసుకుని తినగా.. చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చేరారు. వివరాలు చూసినట్లయితే.. స్థానిక తిర్యానీ మండల కేంద్రంలో ప్రతీ శుక్రవారం సంత జరుగుతుంది. అక్కడికి తాండూర్ నుంచి వచ్చే ఓ వ్యక్తి మిర్చి, ఉల్లి బజ్జీలను అమ్ముతుంటాడు. ఎప్పటిలానే కొందరు ఆ సంతలో అతని దగ్గర నుంచి మిర్చి, ఉల్లి బజ్జీలు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లారు. ఆపై వాటిని లొట్టలేసుకుంటూ తిన్నారు. అంతే! రాత్రి అయ్యేసరికి వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు 60 మంది వరకు ఆసుపత్రిలో పాలవ్వగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. కాగా, కలుషితమైన ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురయ్యారని.. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రజలు బయట ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ హర్ష సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట !!
చిన్నారిని కాపాడిన వ్యక్తికి ఊహించని ట్విస్ట్.. అంతలోనే ??
నగలు ఇస్తానన్నా వదలని దొంగ.. చివరికి ??
హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??
త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు