హైవేపై ఆగిఉన్న కారు.. దగ్గరకు వెళ్లి చూసిన పోలీసులు.. చివరకు ??
అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలో తాజాగా మరోసారి తుపాకీ పేలింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఏమై ఉంటుందో అని తెలుసుకునేందుకు కారు వద్దకు వెళ్లిన పోలీసులు అందులో ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు.
అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలో తాజాగా మరోసారి తుపాకీ పేలింది. మౌంట్ వెర్నాన్ లో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో హైవేపై ఆగిన ఓ కారును పోలీసులు గుర్తించారు. ఏమై ఉంటుందో అని తెలుసుకునేందుకు కారు వద్దకు వెళ్లిన పోలీసులు అందులో ఓ వ్యక్తిని, అతనితో పాటు ఓ మహిళను గుర్తించారు. వారెవరు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఎందుకు ఆగారు తదితర వివరాలు సేకరించగా ఇద్దరు కూడా వారి పేర్లు తప్పుగా చెప్పినట్టు ఆన్ లైన్ రికార్డు ద్వారా తెలుసుకున్నారు. వాళ్లిద్దరు పాత నేరస్థులు బ్రాండెన్ గ్రాఫిన్, ఆయన భార్య క్రిస్టియానో శాంటోస్ గా గుర్తించారు. వీరిద్ధరిపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తప్పుడు వివరాలు చెప్పడమే కాకుండా, తమను అరెస్ట్ చేయబోయిన పోలీసులపై దాడికి దిగాడు గ్రాఫిన్. పోలీసులనుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు గ్రాఫిన్. పోలీసుల దగ్గర ఉన్న ఓ తుపాకీని లాక్కుని కాల్పులు జరపబోయాడు. దాంతో పోలీసులు అతనిపై జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు గ్రాఫిన్. క్రిస్టియానో శాంటోస్ ను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో అంతా పోలీసులు ధరించిన బాడీ కెమెరాలో రికార్డు అయింది. లొంగిపోవాలని సూచించినప్పటికీ గ్రాఫిన్ కాల్పులకు దిగాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో కూలనున్న కొండచరియ !! జ్ఞాపకాలతో గ్రామం ఖాళీ చేస్తున్న ప్రజలు
దాహం తీర్చిన మహిళకు ఊహించని షాక్ ఇచ్చిన తాబేలు !! ఏంచేసిందో చూడండి
Digital TOP 9 NEWS: మణిపూర్‌లో మళ్ళీ హింస | కశ్మీర్‌లో రామ్‌చరణ్ సందడి
Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ కామెంట్స్