Parrot And Dog Romance: కుక్కపిల్లతో చిలుక రొమాన్స్.. నీ ట్రాప్‌లో పడేదే లేదంటున్న పప్పీ.. ఫన్నీ వీడియో.
చిలుకలు అందంగా మాట్లాడడమే కాదు చక్కగా పాటలు కూడా పాడగలవని మనందరికీ తెలుసు. అలాగే పెంపుడు కుక్కలు తమ యాజమాని దగ్గర పడే గారాలను కూడా మీరు చూసే ఉంటారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిలుక తన పక్కనే ఉన్న కుక్క పిల్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే చిలుక ఈలలు వేస్తూ జింగిల్ బెల్స్ పాటతో ఆ కుక్క పిల్లను ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే కుక్క పిల్ల మాత్రం నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఇవాళ నేను నీ ట్రాప్‌లో పడేది లేదు అన్నట్లు ఆ చిలుకను అవాయిడ్ చేస్తూ ముఖం అటూ ఇటూ తిప్పేసుకుంటుంది. ఈ సరదా సన్నివేశాన్ని ఓ యూజర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ… ‘పక్షులు పాడడానికి ఇష్టపడతాయి. కానీ కుక్కలు…’ అంటూ కాప్షన్ జోడించారు. ఈ వీడియోను 2 లక్షలమందికి పైగా వీక్షించారు. తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ ‘కుక్కను చిలుక శాంతింపజేయలేకపోయింది’ అని రాసుకొచ్చాడు. అదే సమయంలో మరొక నెటిజన్ ‘హే బ్రో… కుక్క పిల్ల ఎక్స్‌ప్రెషన్స్ చూడండి’ అని వీడియోకు రిప్లై ఇచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

