Viral Video: ఇలాంటి తల్లిదండ్రులు ఎవరికీ ఉండకూడదు..! అసలు విషయం తెలిస్తే పాపం అనిపించక ఉండదు…(వీడియో)
చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు వేరేవాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం మరో రూపంలో వెంటాడింది. బిడ్డను కొనుక్కొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో ఆ పిల్లవాడు మళ్లీ అనాథ అయ్యాడు.
చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు వేరేవాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం మరో రూపంలో వెంటాడింది. బిడ్డను కొనుక్కొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో ఆ పిల్లవాడు మళ్లీ అనాథ అయ్యాడు. గత్యంతరం లేక ఆ పెంపుడు తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో పెరిగి పెద్దయ్యాడు. కన్న తల్లిదండ్రుల దగ్గరకు చేరాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అక్కడా భంగపాటు తప్పలేదు ఆ కుర్రవాడికి. ఈ క్రమంలో తల్లిదండ్రులను తనకు బ్రతుకు తెరువు చూపమంటూ వేడుకుంటున్నాడు.చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 17 ఏళ్ల లియు జుజౌ. బంధువుల ఇళ్లలో జీవించడం కష్టం కావడంతో అక్కడినుంచి బయటపడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో తనకి అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలుసుకున్న లియు వారి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత కాలం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆపై ఇంటి పేరు ఆధారంగా.. ఎలాగోలా కన్నతండ్రిని కనిపెట్టగలిగాడు. 21 డిసెంబర్ 2021లో లియు.. తన తండ్రిని కలిశాడు. కానీ, లూయు తన కొడుకే కాదని అతను బయటికి పొమ్మన్నాడు. దీంతో పోలీసుల సహకారంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా లియు.. డింగ్ కుమారుడే అని తేలింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. డింగ్‌తో ఉంది లియు కన్నతల్లి కాదు. లియుని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకుని ఆ జంట విడాకులతో వేరు పడింది. కొంతకాలానికి మళ్లీ వివాహం చేసుకుని వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. తర్వాత కన్నతల్లిని వెతుక్కుంటూ వెళ్లాడు లియు. తనకు ఇల్లు లేదని, సాయం చేయాలని కోరాడు ఆమెను. ఆమె దానికి నిరాకరించింది. దీంతో కన్నవాళ్లను ఒక దగ్గరికి చేర్చి పంచాయితీ పెట్టాడు. తనకు ఇల్లు కట్టించి తీరాల్సిందేనని లియు డిమాండ్ చేశాడు… అయితే చదువుకోవడానికి ఫీజులు చెల్లిస్తామని, బతకడానికి కొంత డబ్బు ఇస్తానని ఆ తండ్రి మాత్రం అంగీకరించాడు. దీంతో లియు కొర్టుకెక్కాడు. తనకు కోర్టులో న్యాయం జరుగుతందని ఆశిస్తున్నాడు. తనను పెంచుకున్న తల్లిందండ్రులు ఇచ్చిన ఇల్లు మొత్తం శిధిలావస్థలో ఉందని, కనీసం దానిని బాగు చేసిచ్చినా చాలని వేడుకుంటున్నాడు పాపం ఆ కుర్రవాడు.