అయోధ్యకు నేపాల్ మీదుగా పాక్ మహిళ పాదయాత్ర !!

|

Feb 17, 2024 | 11:09 AM

అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు పాకిస్తాన్‌ మమిళ సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్‌ తాను కృష్ణ భక్తురాలిని అని చెప్పుకుంటోంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది.

అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు పాకిస్తాన్‌ మమిళ సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్‌ తాను కృష్ణ భక్తురాలిని అని చెప్పుకుంటోంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని పేర్కొంది. సోషల్ మీడియాలో సీమా హైదర్‌కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్‌తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్‌ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్‌ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనకు పోలీసుల బ్రేక్

బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు !!

రిటైర్ అయినా సొసైటీకి టీచర్.. 12 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్ !!

చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్‌ వ్యోమనౌక

హమాస్ అగ్రనేత సిన్వర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్‌

Follow us on