చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్ వ్యోమనౌక
జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’.. చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ కీలకమైన సమాచారాన్నిపంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు. వాటి సాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన వివరాలను పొందొచ్చని జపాన్ అంతరిక్ష సంస్థ తాజాగా తెలిపింది. స్లిమ్ వ్యోమనౌక 2024 జనవరి20న చంద్రుడిపై దిగింది. అది తలకిందులుగా ల్యాండ్ కావడంతో దాని సౌరఫలకాలు ముందుగా సూర్యుడి నుంచి కాంతిని పొందలేకపోయాయి.
జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’.. చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ కీలకమైన సమాచారాన్నిపంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు. వాటి సాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన వివరాలను పొందొచ్చని జపాన్ అంతరిక్ష సంస్థ తాజాగా తెలిపింది. స్లిమ్ వ్యోమనౌక 2024 జనవరి20న చంద్రుడిపై దిగింది. అది తలకిందులుగా ల్యాండ్ కావడంతో దాని సౌరఫలకాలు ముందుగా సూర్యుడి నుంచి కాంతిని పొందలేకపోయాయి. అయితే, 8వ రోజు నుంచి అది పనిచేయడం ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా ఈ వ్యోమనౌక తన మల్టీ బ్యాండ్ స్పెక్ట్రల్ కెమెరా సాయంతో జాబిల్లి శిలల్లోని మూలకాలను శోధించింది. ఒక రాతి ముక్కను అది విశ్లేషిస్తుందని అంతా భావించారు. కానీ, ఏకంగా 10 శిలలను అది శోధించింది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమైంది. చంద్రుడి శిలల్లోని మూలకాలను.. భూమి మీదున్న శిలల్లోని మూలకాలను పోల్చి చూడటం ద్వారా కీలక విషయాలను తెలుసుకోవచ్చనీ రెండు చోట్లా ఒకే రకం మూలకాలు ఉన్నాయా అన్నది తేల్చవచ్చు అని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమాస్ అగ్రనేత సిన్వర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం
బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??
చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు