డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి కన్నుమూసిన బస్ డ్రైవర్
మాయదారి గుండెపోటు మహమ్మారిలా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ అటాక్ చేస్తోంది. ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ మాయదారి జబ్బు సమయం సందర్భం లేకుండా అటాక్ చేస్తూ బాధితులతోపాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తుందా అనిపిస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. వెంటనే ప్రమాదాన్ని గుర్తించి.. ప్రయాణికులను కాపాడి తాను కన్నుమూసాడు.
మాయదారి గుండెపోటు మహమ్మారిలా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ అటాక్ చేస్తోంది. ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ మాయదారి జబ్బు సమయం సందర్భం లేకుండా అటాక్ చేస్తూ బాధితులతోపాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తుందా అనిపిస్తోంది. తాజాగా బస్సు నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. వెంటనే ప్రమాదాన్ని గుర్తించి.. ప్రయాణికులను కాపాడి తాను కన్నుమూసాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తోంది ఆర్టీసీ బస్సు. ఈ సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్‌కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. అనుమానం వచ్చిన అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును వెంటనే పక్కకు ఆపాడు. ఆ పై దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్యకు నేపాల్ మీదుగా పాక్ మహిళ పాదయాత్ర !!
రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు పోలీసుల బ్రేక్
బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు !!