98ఏళ్ల  బామ్మతో గుడ్లగూబ ముచ్చట్లు.

98ఏళ్ల బామ్మతో గుడ్లగూబ ముచ్చట్లు.

Phani CH

|

Updated on: May 12, 2023 | 10:00 AM

ఒక గుడ్లగూబ దాదాపు 98ఏళ్లు పైబడిన బామ్మతో స్నేహం చేస్తోంది. ప్రతిరోజూ వారి ఇంటికి వచ్చి బామ్మను పరామర్శిస్తుంది. కానీ, ఆ ఇంట్లో మరెవరితోనూ ఆ పక్షి మాట్లాడదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో కళ్లద్దాలు పెట్టుకున్న ఓ బామ్మ తమ ఇంటి బాల్కనీలోకి వచ్చి గుడ్లగూబను..

ఒక గుడ్లగూబ దాదాపు 98ఏళ్లు పైబడిన బామ్మతో స్నేహం చేస్తోంది. ప్రతిరోజూ వారి ఇంటికి వచ్చి బామ్మను పరామర్శిస్తుంది. కానీ, ఆ ఇంట్లో మరెవరితోనూ ఆ పక్షి మాట్లాడదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో కళ్లద్దాలు పెట్టుకున్న ఓ బామ్మ తమ ఇంటి బాల్కనీలోకి వచ్చి గుడ్లగూబను చూసి చిరునవ్వులు చిందిస్తూ ఇంగ్లీషులో దాంతో ఏదో మాట్లాడుతోంది. గుడ్లగూబ కూడా ఆమె అడిగేదానికి సమాధానంగా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌, మూమెంట్స్‌ ఇస్తుంది. ఈ సమయంలో ఆ బామ్మ వాళ్ల మనవరాలు అక్కడి వచ్చింది. అయితే గుడ్లగూబ ఆ అమ్మాయికి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేదు. ఆ పక్షి ఆ బామ్మతో తప్ప ఆ ఇంట్లో మరెవరితో స్నేహం చేయదు. బామ్మను చూడగానే మాత్రం అది తెగ మురిసిపోతుంది. ఇదంతా ఆ అమ్మాయి రికార్డ్‌ చేసింది. తామంతా తమ తాతగారే ఇలా పక్షి రూపంలో వచ్చారని భావిస్తున్నామని ఆ అమ్మాయి తెలిపింది. ఆ పక్షి రోజూ వచ్చి తమ బామ్మతో అలా చాలాసమయం గుడుపుతుందని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పిల్లి చేసే స్టంట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.. నెట్టింట వీడియో వైరల్

అర్జున్‌ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్

Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు

Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..

Virupaksha: డబుల్ బ్లాక్‌ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం