ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
సోషల్ మీడియా అనేది ఓ అద్భుతమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సోషల్ మీడియా కారణంగానే ప్రపంచంలో ఏ మూలన జరిగే ఘటన అయినా నిముషాల్లో ట్రెండ్ అయిపోతుంది. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఈ వీడియోలో ఓ పిల్లి తన..
సోషల్ మీడియా అనేది ఓ అద్భుతమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ సోషల్ మీడియా కారణంగానే ప్రపంచంలో ఏ మూలన జరిగే ఘటన అయినా నిముషాల్లో ట్రెండ్ అయిపోతుంది. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఈ వీడియోలో ఓ పిల్లి తన కుటుంబంతో కలిపి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటోంది. పిల్లికి కుటుంబం ఏంటి అనుకోకండి.. ఆ పిల్లికి ఏకంగా ఐదు పిల్లలు, ఒక భార్య ఉన్నారు. ఆ పిల్లి తన భార్య మీద ఎంతో ప్రేమతో చేయి వేసి మరీ పడుకుంటుంది. ఇంకా ఆ పిల్లి పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ పిల్లికి తల్లిదండ్రులెవరో కానీ మంచి అందమైన ఆడ పిల్లిని తీసుకొచ్చి పెళ్లి చేశారని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేస్తే.. మరో నెటిజన్ అయితే ‘ఇంకా ఎక్కువగా ప్రేమించేయకు మిస్టర్ క్యాట్.. మీ మంచం మీద ఖాళీ లేదు’ అంటూ స్పందించాడు. ‘పిల్లి బ్రో ఫామిలీ మాత్రమే కాదు.. ఇల్లు, ఇంట్లో డెకరేషన్ కూడా సూపర్’ అని, మరొకరు రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైగర్ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్
Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్
Adipurush: వివాదంలో ఆదిపురుష్.. కోర్టు ముంగిట ప్రభాస్ ఫిల్మ్
Kriti Sanon: మొదటి ఫొటోషూట్‌లోనే అలా జరగడంతో కన్నీళ్లతో ఇంటి కొచ్చిన కృతి సనన్..
Parineeti Chopra: ఆమె హీరోయిన్.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…