పెంపుడు శునకాలపై పన్ను !! ఆ రాష్ట్రంలో కొత్త రూల్..

| Edited By: Ram Naramaneni

Jan 25, 2023 | 10:18 AM

మధ్యప్రదేశ్‌ లోని సాగర్‌ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌ లోని సాగర్‌ నగరం కొత్త చట్టం తీసుకురాబోతోంది. శునకాలను పెంచుకునేవారిపై పన్నులు విధించనుంది. ప్రజల భద్రత, పరిశుభ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ తరహా పన్నులు విధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజాగా సాగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో శునకాలను పెంచుకునే యజమానులకు పన్ను విధించడంపై నిర్ణయం తీసుకున్నారు. 48 మంది కౌన్సిలర్లు దీన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై విధివిధానాలను రూపొందించనున్నట్లు సాగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ శుక్లా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైలెక్కుతూ ఒక్కసారిగా జారిపడ్డ మహిళ.. చివరికి ఏమైందంటే ??

25 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ‌పై యాసిడ్ దాడి..

అది ఇళ్లా.. దొంగల బజారా ?? ఏకంగా రూ.100కోట్ల పురాతన వస్తువులు

హలో మిస్టర్ దొంగ.. మా ఇంటికి రాకు.. వచ్చి నిరాశపడకు.. అంటూ..

నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..

 

Published on: Jan 25, 2023 09:22 AM