గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 25, 2023 | 10:16 AM

క్రమేపీ అడవులు అంతరించిపోతుండటంతో జనావాసాల్లోకి వస్తున్నాయి వన్యమృగాలు. ఆహారం, నీటి కోసం జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జంతువుల విధ్వంసంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

క్రమేపీ అడవులు అంతరించిపోతుండటంతో జనావాసాల్లోకి వస్తున్నాయి వన్యమృగాలు. ఆహారం, నీటి కోసం జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జంతువుల విధ్వంసంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఏనుగు విధ్వంసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద ఏనుగు రోడ్డు దాటుతోంది. కొంతమంది వాహనదారులు ఆ ఏనుగు రోడ్డు దాటడం చూసి దూరంగా వాహనాలు నిలిపివేశారు. కానీ ఓ చిన్న ట్రాలీ మాత్రం ఏనుగుకు సమీపంగా వచ్చేసింది. ఏనుగు దానిని గమనించి ట్రాలీ దగ్గరకు వెళ్తుంది. వెంటనే డ్రైవర్‌ ట్రాలీని వెనక్కి పోనిచ్చాడు. అయినా ఏనుగు ‘నేను రోడ్డు దాటడం చూసి వాళ్లంతా అక్కడే ఆగిపోతే.. నువ్వేంట్రా.. ‘ అన్నట్టు ఆ ట్రాలీని ఎత్తిపడేసింది. రోడ్డుపైనుంచి పక్కను నెట్టేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్‌ !!

విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో

వాహనాలతో వెరైటీ రెస్టారెంట్‌.. వెళితే వాహ్వా అనాల్సిందే..

Published on: Jan 25, 2023 08:34 AM