విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో
చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు ఔరా అనిపిస్తుంటాయి.
చిన్న వయస్సులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుందంటుంటారు. కానీ కొన్నిసార్లు చిన్నారులు వారి వయసుకు మించి చేసే పనులు ఔరా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. విమానంలో తోటి ప్రయాణికుల సీట్ల మధ్యలోంచి అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఓ బుడ్డోడు. తాను వెళ్లే దారిలో అటువైపు, ఇటువైపు సీట్లలో కూర్చున్న వాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తున్నాడు. ఈ వీడియో చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. బుడ్డోడికి చేయిచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో విమానంలో ఉన్న ప్రయాణికులు ఎలాంటి అనుభూతినైతే పొందుతున్నారో.. ఈ వీడియో చూసిన వాళ్లు కూడా ఇంచుమించు అలాంటి క్యూట్ నెస్ ని ఆస్వాదిస్తున్నారు. ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jan 25, 2023 08:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos