నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద.. సినిమాను మించిన సీన్..

Phani CH

Phani CH |

Updated on: Jan 23, 2023 | 9:07 PM

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని నలగురు వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం చోరీ చేశారు. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని నలగురు వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం చోరీ చేశారు. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాహనాన్ని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దొంగలు నగదు బాక్స్‌ను పడేసి వెళ్లిపోయారు. దీంతో నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానిక SBI ఏటీఎంలో డబ్బు చోరీకి ప్రయత్నించింది నలుగురు దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాస్‌కట్టర్లతో ఏటీఎంని కట్‌ చేసి 19లక్షల సొమ్మును కాజేశారు. వాళ్లను పట్టుకునేందుకు సినీ ఫక్కీలో చేజ్ చేశారు పోలీసులు. పారిపోయే ప్రయత్నంలో డబ్బున్న డబ్బాలను మరో వాహనం ఢీకొట్టింది. ఆ ఎపెక్ట్‌తో బాక్స్‌లు కిందపడి డబ్బంతా చెల్లా చెదురైపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హారన్‌ కొట్టారని కారుతో ఢీ.. బానెట్‌పై అర కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లి మరీ..

ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??

ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్

మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..

గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu