లిఫ్టులోకి కుక్కను తీసుకురావద్దనందుకు..బాలుడిని తీవ్రంగా కొట్టిన మహిళ

Updated on: Feb 27, 2025 | 8:51 PM

8 ఏళ్ల వయసున్న ఓ బాలుడు తమ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్టులోకి ఎక్కాడు. అక్కడకు ఓ మహిళ వచ్చింది. వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకు వచ్చింది. కానీ శునకానికి బెల్ట్‌ లేకపోవడంతో అది చూసి భయపడ్డ బాలుడు.. ఆంటీ ప్లీజ్ దాన్ని లోపలికి తీసుకు రావొద్దంటూ బతిమాలాడు. అది చూసిన ఆమెకు జాలి కలగడానికి బదులు కోపం తన్నుకొచ్చింది.

నా ఇష్టం నేను తీసుకొస్తానంటూనే కుక్కను లోపలికి తీసుకు వచ్చింది. బాలుడు భయంతో అక్కడక్కడే పరుగులు తీస్తుండగా.. మహిళ అతడిని పట్టుకుని పొట్టు పొట్టు కొట్టింది. ఆపై లిఫ్టులోంచి బయటకు తోసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీ శివారు ప్రాంతమైన గ్రేటర్ నోయిడా.. గౌర్ సిటీ 2 అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. బాలుడికి చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే విపరీతమైన భయం. అందువల్లే బెల్ట్‌ లేని కుక్కను లోపలికి తీసుకు రావద్దంటూ ఆమెను బతిమాలాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. అతడు ఎంత వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా కుక్కను లోపలికి పోనిచ్చింది. బాలుడు ఏడవడం ప్రారంభించగా.. సదరు మహిళ అతడిని కొట్టడం మొదలు పెట్టింది. అతడిపై దాడి చేస్తూనే.. లిఫ్టు నుంచి బయటకు తోసేసింది. అతడు బయటకు వెళ్లకుండా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృశ్యమైన జ్యోతిష్యుడు అస్థిపంజరమయ్యాడు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ సీన్స్‌

పిల్లలు చనిపోతుంటే ఫోటో షూట్‌ చేస్తారా.. జెలెన్‌స్కీ మీద మస్క్‌ మండిపాటు

పాఠశాలకు వెళ్తూ గుండె*పోటుతో కుప్పకూలిన విద్యార్థిని

ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!