No Rush in Metro: మెట్రో నిండా మగాళ్లే.. ఏం జరిగింది.? హైదరాబాద్‌ మెట్రోలో తగ్గిన రద్దీ.. ఎందుకంటే.?

No Rush in Metro: మెట్రో నిండా మగాళ్లే.. ఏం జరిగింది.? హైదరాబాద్‌ మెట్రోలో తగ్గిన రద్దీ.. ఎందుకంటే.?

Anil kumar poka

|

Updated on: Dec 20, 2023 | 6:32 PM

తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు మహిళలు ఆర్టీసీ ప్రీ జర్నీని వాడుకుంటున్నారు. ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో,

తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు మహిళలు ఆర్టీసీ ప్రీ జర్నీని వాడుకుంటున్నారు. ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, ఆ ఎఫెక్ట్ కొంత మెట్రో రైళ్లపై కనిపిస్తోంది. లాంగ్ జర్నీ చేసే వాళ్లు తప్ప ఎక్కువ మంది ఆర్టీసీ ఫ్రీ సర్వీస్‌లను వాడుకుంటున్నారు. హైద్రాబాద్ మహానగరంలో పబ్లిక్ నుండి మంచి ఆదరణ పొందుతున్న మెట్రో రైల్‌పై ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం కనిపిస్తోంది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రం మెట్రో లు ఫుల్ అవుతున్నాయి.

గతంలో రోజూ 5 లక్షల వరకు మెట్రో రైడర్ షిప్ నమోదయ్యేది. అయితే, ఆర్టీసీలో మహిళలకు ఉచితం ఇవ్వడంతో కొంత వుమెన్ క్రౌడ్ మెట్రో కంటే ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 12 వందల నుండి 15 వందల వకు సేవ్ అవుతుందంటున్నారు. మరికొందరు మెట్రో స్టేషన్స్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వినియోగించుకుంటూనే, రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే గతం కంటే కొంత లేడీస్ రష్ తగ్గిందని, కూర్చోవడానికి మెట్రో లో సీట్లు దొరుకుతున్నాయంటున్నారు ఇతర ప్రయాణికులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.