AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్ల‌కు తాళాలు వేయ‌రు.. క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ.. ఎక్కడంటే..?

ఇళ్ల‌కు తాళాలు వేయ‌రు.. క్రైమ్‌ రేట్‌ చాలా తక్కువ.. ఎక్కడంటే..?

Phani CH
|

Updated on: Aug 02, 2025 | 11:51 AM

Share

ఓ దేశాన్ని అద్దెకు తీసుకోవ‌చ్చు అని తెలుసా? చాలా మందికి తెలియ‌ని ఓ చిన్న దేశం ఉంది. ఆ దేశం పేరు లిక్ట‌న్ స్టైన్. 160 చ‌ద‌ర‌పు కి.మీ విస్తీర్ణంలో ఉంటుంది. కారు లో అర‌గంట‌లో చుట్టేయచ్చు. ఎన్నో విమాన‌శ్ర‌యాల కంటే చిన్న‌ది. ఆ దేశం స్విట్జ‌ర్లాండ్-ఆస్ట్రియా మ‌ధ్య ఉంది. ఆ దేశాన్ని ఓ రాజు ప‌రిపాలిస్తున్నాడు. ఆ రాయ‌ల్ ఫ్యామిలీ ఓ కొండ‌పైన ఉంటుంది.

రోమ‌న్ క్యాథ‌లిక్స్ ఉండే దేశ‌మ‌ది. వారు జ‌ర్మ‌న్ మాట్లాడుతారు. స్విస్ ఫ్రాంక్‌ వారి కరెన్సీ. ఈ దేశానికి వాయు మార్గం..జ‌ల మార్గం లేవు. జ్యూరిక్ నుంచి రైల్లోగానీ, కారులో కానీ వెళ్లొచ్చు. భ‌ద్ర‌త ఎక్కువ ఉండే దేశాల్లో ఇదొక‌టి. జ‌నాభా 40 వేలు కూడా ఉండ‌దు. క్రైమ్ రేట్ లేక‌పోవ‌డం వ‌ల్ల అక్క‌డి వారు ఇళ్ల‌కు తాళాలు కూడా వేయ‌రు. వారంతా ఒక‌రికొక‌రు ప‌రిచ‌యం. ట్యాక్స్ బెనిఫిట్ కోసం బ‌య‌ట వారు అక్క‌డ పెట్టుబ‌డులు పెడుతుంటారు. నేష‌న‌ల్ హాలీడేస్… పండ‌గ‌ల వేళ అక్క‌డి ప్ర‌జ‌లు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రిస్తారు. ఆగ‌స్టు 15 వారి నేష‌న‌ల్ డే. కావాల‌నుకుంటే 70 వేల డాల‌ర్లు చెల్లించి మీరు ఈ దేశాన్ని ఒక రోజు అద్దెకు తీసుకోవ‌చ్చు. అప్పుడు మీకు వారంతా రెడ్ కార్పెట్ తో స్వాగ‌తం ప‌లుకుతారు. రాయ‌ల్ ప్యాలెస్ లో వ‌స‌తి ఏర్పాటు చేస్తారు. స్ట్రీట్ బోర్స్డ్ మీ పేరిట వెలుస్తాయి. మిమ్మ‌ల్ని ఓ రాజులా ట్రీట్ చేస్తారు. మీ ఫోటోతో ఫేక్ క‌రెన్సీ కూడా క్రియేట్ చేస్తారు. దాంతో అక్క‌డ ఏం కావాల‌న్నా కొనుక్కోవ‌చ్చు. టూరిస్టుల‌తో అక్క‌డివారు ఎంతో ప్రేమ‌గా ఉంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు

TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్‌ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్

ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే

Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్‌.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!

Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్‌.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది