90స్ లో రేప్ చేశాడు.. రూ. 40 కోట్లు ఇప్పించండి..

Phani CH

Phani CH |

Updated on: Feb 01, 2023 | 9:52 AM

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ గురించి ఒక పెద్ద వార్త అనూహ్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 1990ల ప్రారంభంలో తనపై మైక్ టైసన్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది.

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ గురించి ఒక పెద్ద వార్త అనూహ్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 1990ల ప్రారంభంలో తనపై మైక్ టైసన్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది. న్యూయార్క్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఇద్దరూ కలుసుకున్నారట. తర్వాత తనపై లిమోసిన్‌లో అత్యాచారం చేశాడని, ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాయని ఆమె చెప్పింది. ఇలా తనను క్షోభకు గురి చేసినందుకు ఆమె న్యూయార్క్‌ న్యాయస్థానంలో దావా వేశారు. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 40 కోట్ల రూపాయలు తనకు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే మహిళ దాఖలు చేసిన ఫిర్యాదులో రేప్‌ ఏ రోజు జరిగింది అనే తేదీ పేర్కొనలేదు, ఈ ఘటన కేవలం 1990ల ప్రారంభంలో జరిగిందని పేర్కొంది. ఈ ఫిర్యాదును తాను మొదట నమ్మలేదని ఆమె తరపు న్యాయవాది డారెన్ సీల్‌బాచ్ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపినప్పుడు అవి చాలా వరకు నిజమని తేలిందని ఈ విషయంపై టైసన్ ఏజెన్సీని సమాధానం కోరినట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం అప్లై చేసిన కుక్కపిల్ల.. అప్లికేషన్‌లో సంతకం కూడా !!

బ‌స్సులోకి ఎక్కి సీట్లలో కూర్చుకున్న శునకాలు !! నెట్టింట వీడియో వైరల్

వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్.. అంతలోనే పని కానిచ్చేశారు..

రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వ‌ద్ద డ్యాన్స్.. ఇంతలో !!

పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu