రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వ‌ద్ద డ్యాన్స్.. ఇంతలో !!

Phani CH

Phani CH |

Updated on: Feb 01, 2023 | 9:45 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడకం మరింత పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సినిమా పాటలకు డాన్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామనైపోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడకం మరింత పెరిగిపోయింది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సినిమా పాటలకు డాన్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామనైపోయింది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తదితర ప్లాట్ ఫామ్స్లో పోస్ట్ చేసే ఇలాంటి వీడియోలు కొందరిని రాత్రికి రాత్రే పాపులర్ చేసేస్తున్నాయి. రీల్స్ కోసం ఏం చేసేందుకైనా కొంద‌రు వెనుకాడ‌టం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో 22 ఏండ్ల యువ‌కుడు రైల్వే క్రాసింగ్ వ‌ద్ద టెడ్డీ అవుట్‌ఫిట్‌తో డ్యాన్సులు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. టెడ్డీ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని సూరజ్ కుమార్‌గా గుర్తించారు. రైల్వే ట్రాకుల ప‌క్కనే త‌న రీల్ కోసం డ్యాన్స్ చేశాడు. ఎక్కువ లైక్‌లు, వ్యూస్ కోసం అత‌డు టెడ్డీ దుస్తుల్లో రైలు ప‌ట్టాల ప‌క్కన డ్యాన్స్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. అత‌డు అనుకున్నట్టు వ్యూస్ ద‌క్కినా సూర‌జ్ విన్యాసాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కంట‌ప‌డ‌టంతో అదుపులోకి తీసుకుంది. అతగాడిపై కేసు నమోదు కూడా పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్

టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌.. షాకవుతున్న నెటిజన్లు

చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!

మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!

కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్‌ ఓపెన్‌ చేసి నడిరోడ్డుపై శృంగారం

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu