బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన కుక్కపిల్ల.. అప్లికేషన్‌లో సంతకం కూడా !!
పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అందులో పెంపుడు జంతువుల విన్యాసాలు, వాటి చిలిపి చేష్టలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.
పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అందులో పెంపుడు జంతువుల విన్యాసాలు, వాటి చిలిపి చేష్టలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇప్పటి వరకు ఎక్కడా చూసిఉండరు. ఈ వీడియో ఓ చిన్న కుక్కపిల్లకు సంబంధించినది. ఈ బుజ్జికుక్కపిల్లకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే అదొక నవజాత కుక్కపిల్ల. పుట్టీ పుట్టగానే అది చేసిన పనికి నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో… అప్పుడే పుట్టిన కుక్కపిల్లకు బర్త్ సర్ట్‌ఫికెట్ తీసుకుంటున్నారు దాని యజమాని. అందుకోసం ఆ చిన్ని కుక్కపిల్ల పాదాలతో తన బర్త్ సర్టిఫికెట్‌పై సంతకం చేయించారు. ఈ బుజ్జి కుక్కపిల్లకు అలెక్స్ అని పేరు పెట్టారు. దాని పేరు, దాని తల్లిదండ్రుల పేర్లతో పాటు కుక్కపిల్ల పుట్టిన తేదీతో జనన ధృవీకరణ పత్రంలో పొందుపరిచారు. యజమాని చిన్న కుక్కపిల్లను పట్టుకొని సర్టిఫికేట్‌పై పప్పి పాదాలతో ముద్రవేయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సులోకి ఎక్కి సీట్లలో కూర్చుకున్న శునకాలు !! నెట్టింట వీడియో వైరల్
వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయ్.. అంతలోనే పని కానిచ్చేశారు..
రీల్స్ కోసం ఓవరాక్షన్.. రైల్వే క్రాసింగ్ వద్ద డ్యాన్స్.. ఇంతలో !!
పెళ్లిమండపంలో ప్రత్యక్షమైన సోదరి.. అంతా షాక్
టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్.. షాకవుతున్న నెటిజన్లు