పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??

|

Feb 21, 2024 | 1:27 PM

తల్లిదండ్రులు తన పెళ్లి ఊసు ఎత్తడం లేదని, మ్యారేజీ బ్యూరోని సంప్రదించినా పని కావడం లేదని ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను తానే వెతుక్కుందామని డిసైడ్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న అతనికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేసాడు. 'వధువు కావలెను' అంటూ తన రిక్షాకు ఓ బోర్డు తగిలించుకుని తనకు కాబోయే వధువును వెతుక్కునేందుకు బయలుదేరాడు.

తల్లిదండ్రులు తన పెళ్లి ఊసు ఎత్తడం లేదని, మ్యారేజీ బ్యూరోని సంప్రదించినా పని కావడం లేదని ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యను తానే వెతుక్కుందామని డిసైడ్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న అతనికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టేసాడు. ‘వధువు కావలెను’ అంటూ తన రిక్షాకు ఓ బోర్డు తగిలించుకుని తనకు కాబోయే వధువును వెతుక్కునేందుకు బయలుదేరాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ నగరానికి చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్‌ ఈ-రిక్షా నడుపుతూ తల్లిదండ్రుల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా కాస్త స్థిరపడడంతో ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతని తల్లిదండ్రులకు విషయం చెబితే నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే వెతుక్కో అంటూ తప్పించుకున్నారు. ఇందుకోసం అతడు తెలిసిన వాళ్లని పెళ్లి గురించి అడిగాడు. ఓ మ్యారేజ్ బ్యూరోనికూడా సంప్రదించాడు. కానీ లాభం లేకపోయింది. దీంతో అతను తన ఈ-రిక్షాకు ఓ హోర్డింగు కట్టుకొని.. ఆ హోర్డింగుపై తన ఫొటోతోపాటు ఎత్తు, పుట్టినతేదీ, బ్లడ్‌ గ్రూపు, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలన్నీ రాయించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి

కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..

వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం

ఒకే బోనులో అక్బర్‌.. సీత.. విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహం..

ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు