ఏటీఎంలో చోరీ.. లక్షలు దోచేసిన కేటుగాళ్లు..
మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఏటీఎంలు వేటినీ వదలడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లోని బయ్యారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఒక SBI ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంపై దొంగలు కన్నేశారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి రూ.29 లక్షల నగదును అపహరించినట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఏటీఎంలు వేటినీ వదలడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లోని బయ్యారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఒక SBI ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంపై దొంగలు కన్నేశారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి రూ.29 లక్షల నగదును అపహరించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వినియోగదారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవికుమార్, ఎస్ఐ ఉపేందర్ ఏటీఎంను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆర్ధరాత్రి సమయంలో బ్లాక్ కారులో వచ్చిన ఆరుగురు దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆనవాళ్లను సేకరించారు. నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగురుతున్న విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన
పెళ్లికోసం యువకుడి తిప్పలు.. ఏం చేశాడంటే ??
ఆరోగ్యానికి సంజీవని ఈ గింజలు.. మహిళలకు అంతకుమించి
కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..
వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం