స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్
నారాయణపేట జిల్లా భూత్పూర్ గ్రామ నీటిగుంతలో మొసలి, కొండచిలువ మధ్య తీవ్ర పోరాటం స్థానికంగా కలకలం రేపింది. కొండచిలువను మొసలి పట్టుకోగా, గ్రామస్తులు వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. జనం అరుపులతో భయపడిన మొసలి కొండచిలువను వదిలేసింది. రిజర్వాయర్ దిగువన ఉండటంతో తరచూ మొసళ్లు, పాములు వస్తున్నాయని గ్రామస్థులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామంలోని ఓ నీటి గుంతలో మొసలి, కొండచిలువ మధ్య పోరాటం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఓ గుంతలో మొసలి నోటికి భారీ కొండచిలువ చిక్కింది. దానిని ఎటూ కదలనీయకుండా మొసలి నోటితో గట్టిగా పట్టుకుంది. అయితే.. మొసలి నోటి నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ అష్టకష్టాలు పడింది. ఈ క్రమంలో అది బుసలు కొట్టటంతో.. ఏంటా అని అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు, విద్యార్థులు వెళ్లారు. అంతే.. అక్కడి సీన్ చూసి భయంతో ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోయారు. ఓ వైపు మొసలి వదలనంటుంటే.. ఎలాగైనా తప్పించుకోవాలని కొండచిలువ చేస్తున్న ప్రయత్నం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు ధైర్యం చేసి.. మొసలి నోట నుంచి కొండచిలువను విడిపించే ప్రయత్నాలు చేశారు. విషయం గ్రామం అంతా పాకడంతో గ్రామస్థలంతా అక్కడికి చేరుకున్నారు. జనం పెద్ద సంఖ్యలోచేరడంతో అక్కడి వాతావరణం అలజడిగా మారింది. జనం అరుపులు, కేకలతో భయపడిన మొసలి.. ఎట్టకేలకు కొండచిలువను వదిలేయటంతో అది అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. తర్వాత మొసలి కూడా నీళ్లలోకి వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ సమాచారం ఇచ్చారు. తాజా ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్ దిగువన గ్రామం ఉండడంతో తరచూ పాములు, తేళ్లు, మొసళ్లు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీటి ఊటలు ఏర్పడి గుంతలుగా మారడం, అక్కడ విషసర్పాలు, మొసళ్లు ఆశ్రయం పొందుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు
క్రెడిట్ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే
గుండె ఆరోగ్యం కోసం సూపర్ డ్రింక్
