Mysuru Maharaja: ఇదేందయ్యా ఇది.! ఈ మైసూరు మహారాజుకు సొంతిల్లు, కారు లేవట.!

పలు రాష్ట్రాల్లోని రాజ కుటుంబీకులు కూడా ప్రస్తుతం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పూర్వపు మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ మొత్తంగా 4.99 కోట్ల రూపాయలుగా ప్రకటించారు.

Mysuru Maharaja: ఇదేందయ్యా ఇది.! ఈ మైసూరు మహారాజుకు సొంతిల్లు, కారు లేవట.!

|

Updated on: Apr 04, 2024 | 9:35 PM

పలు రాష్ట్రాల్లోని రాజ కుటుంబీకులు కూడా ప్రస్తుతం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పూర్వపు మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ మొత్తంగా 4.99 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. అయినా ఆయనకు సొంత ఇల్లు, భూమి, కనీసం కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం ఆశ్చర్యం. సోమవారం మంచిరోజు కావడంతో నామినేషన్‌ వేసినట్లు సమాచారం. తన తల్లి ప్రమోద దేవీ వడియార్‌, బీజేపీ స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల అధికారికి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మరో సెట్‌ను ఏప్రిల్‌ 3న దాఖలు చేయనున్నారు.

మైసూరు రాజ్యాన్ని వడియార్‌ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్య్రానంతరం నరసింహరాజ వడియార్‌ 1974లో రాజు అయ్యారు. ఆయన 1984-1999 మధ్య కాంగ్రెస్‌ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందారు. 2013లో కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు యదువీర్‌ మైసూరు రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన మైసూరు 27వ రాజు. మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2016లో దుంగార్‌పుర్‌ యువరాణి త్రిషికను పెళ్లి చేసుకున్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత వడియార్‌ వారసుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles