Monkey Stunt : ఏదైనా అల్లరి పనులు చేసిన ఎంటా కోతి పనులంటూ మన ఇంట్లో.. అమ్మనాన్నలు తిట్టే తిట్లు లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా.. కొన్ని కోతులు విద్యుత్ తీగలపై ప్రయాణిస్తూ దూరంగా ఉన్న భవనం మీదకు చేరుకునేందుకు చేసిన ప్రయత్నం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విద్యుత్ తీగలను ఆసరా చేసుకొని కోతుల గుంపు ఒక భవనం నుంచి మరో భవనాన్ని చేరుకున్నాయి. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్‌గా మారింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఓపెద్ద భవనం నుంచి మరో భవనం మీదకు వెళ్లడానికి కోతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఎలాంటి భయం లేకుండా విద్యుత్ తీగలపై అవి వెళ్లాయి. ఇవి ఓపెన్ ఎలక్ట్రికల్ వైర్లు కాకపోవడంతో వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకదాని తరువాత మరొకటి తీగలపై జారుకుంటూ వెళ్లాయి.
ట్విట్టర్‌లో దీన్ని సుమారు మూడున్నర లక్షల మంది చూశారు. 26 వేల మంది లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలో ఉండే ఇలాంటి సన్నివేశాలు నిజంగానే జరగడం విశేషమని ఒక వ్యక్తి వీడియోకు కామెంట్ పెట్టారు. కోతులకు ఈ ఆలోచన రావడం గొప్ప విషయమని మరో వ్యక్తి కామెంట్ రాశాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.. ఆ తర్వాత ఇతగాడు చూపించిన పైత్యం మీరే చూడండి
Nivetha Thomas : పవర్ స్టార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న ముద్దుగుమ్మ.. వకీల్ సాబ్ ఈ అమ్మడి కెరియర్ కు ప్లేస్ అవుతాడా..