డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.. ఆ తర్వాత ఇతగాడు చూపించిన పైత్యం మీరే చూడండి
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తి..హైటెన్షన్ స్తంభం ఎక్కి హెల్‌చల్ చేశాడు. విద్యుత్ వైర్లు పట్టుకుని వేలాడుతూ...నానా హంగామా సృష్టించాడు. కొంచం అటుఇటు అయ్యిందా..?..
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తి..హైటెన్షన్ స్తంభం ఎక్కి హెల్‌చల్ చేశాడు. విద్యుత్ వైర్లు పట్టుకుని వేలాడుతూ…నానా హంగామా సృష్టించాడు. కొంచం అటుఇటు అయ్యిందా..? ఇక అంతేనా? అక్కడున్న వారందరితో పాటు పోలీసులకు కూడా చుక్కలు చూపించాడు. ఈ ఘటన షాబాద్ మండలం నాగర్ గూడలో చోటు చేసుకుంది.
నాగర్ గూడా గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన నరేష్ పక్కనే ఉన్న హైటెన్షన్ స్తంభం ఎక్కి ఇలా అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులంతా నరేష్‌కు సర్దిచెప్పి కిందకు దింపే ప్రయత్నం చేసినా అతడు ఎవరి మాట వినలేదు.
విషయం తెలుసుకున్న షాబాద్ సిఐ వచ్చి అతనికి నచ్చజెప్పాడు. నీ మీద ఎటువంటి కేసు పెట్టనని, నీ బైక్ నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇదే క్రమంలో మరో నరేష్ భార్య పిల్లలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని రోధిస్తూ…కిందకు దిగమని వేడుకున్నారు. దీంతో ఎట్టకేలకు అతడు కిందకు దిగివచ్చాడు. తృటిలో ప్రాణాపాయం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించినట్లు సమాచారం. కాగా ఆ సమయంలో పవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మాములుగా హైటెన్షన్ వైర్లకు దగ్గరగా వెళ్లినా కూడా కాలి బూడిదై పోవడం ఖాయం. భూమి మీద గడ్డిగింజలు ఉండటంతో బ్రతికిపోయాడు అంటున్నారు స్థానికులు.
Also Read:
ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే
మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…