ఓర్నీ కోతి ప్రేమ సల్లగుండా !! చిన్నారిని హగ్ చేసుకుంటూ తెగ మురిసిపోతుంది

Updated on: Sep 01, 2022 | 9:54 AM

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానులను, వారి కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తాయి. వారిపట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి.

సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానులను, వారి కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తాయి. వారిపట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి. ఇటీవల వన్య ప్రాణులు కూడా ఆహారం కోసమో, నీళ్లకోసమో వనాలను విడిచి జనాల్లోకి వస్తున్నాయి. వీటిలో వానరాలు ముందు వరుసలో ఉంటాయి. వానరం అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇక వాటి వింత చేష్టలను జనం కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ కోతి చేసిన పనికి ముగ్దులైపోయారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటిముందు ఓ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి ఓ కోతి వచ్చింది. ఆ బాలుడితో ఎంతో ప్రేమగా మెలిగింది. ఆ బాలుడి తలలో పేలు చూసింది.. ముద్దు పెట్టుకుంది.. వడిలో పడుకోబెట్టుకుంని ఆడిస్తుంది. ఇంతలో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు వచ్చి కోతివద్ద చిన్నారిని చూసి కంగారు పడ్డారు. బాలుడిని కోతిదగ్గరనుంచి తీసుకోడానికి ప్రయత్నించారు. కానీ ఆ కోతి బిడ్డను తననుండి దూరం చేయొద్దన్నట్టుగా… చిన్నారిని వదలకుండా గట్టిగా హగ్‌ చేసుకుని వదలనంటే వదలనని కూర్చుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీలింగ్‌వాల్‌లో వింత శబ్దాలు.. పరిశీలించి చూడగా షాక్‌..

బుల్లెట్‌ బండి కోసం.. అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేశాడు.. తర్వాత..

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??

పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..

కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

 

Published on: Sep 01, 2022 09:54 AM