సీలింగ్‌వాల్‌లో వింత శబ్దాలు.. పరిశీలించి చూడగా షాక్‌..

ఇటీవల నాగుపాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అంతేకాదు ఒక్కోసారి ఇళ్లలో చొరబడి వాటికి అనుకూలమైన చోట్ల తిష్టవేస్తాయి.

Phani CH

|

Sep 01, 2022 | 9:52 AM

ఇటీవల నాగుపాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అంతేకాదు ఒక్కోసారి ఇళ్లలో చొరబడి వాటికి అనుకూలమైన చోట్ల తిష్టవేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఇంట్లో ఉన్నా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద కొండచిలువ ఇంటి పై సీలింగ్‌ గోడలో దాక్కుని కూర్చుంది. ఆ ఇంటి యజమాని సమాచారంతో స్నేక్‌ క్యాచర్‌ అక్కడికి చేరుకున్నాడు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది అతనిపై దాడికి దిగింది. దాంతో సదరు వ్యక్తి కూడా భయపడతాడు. అయినా అతని ప్రయత్నం ఆపలేదు. దాని తోకను పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించాడు. ఆ కొండచిలువ కూడా తగ్గేదేలేదంటూ అతడిపై దాడి చేస్తూనే ఉంది. చివరికి, చాలా ప్రయత్నాల తర్వాత పెద్ద కొండచిలువను పట్టుకోవడంలో విజయం సాధించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను సోషల్ మీడియా లో షేర్‌ చేశారు. అది కాస్తా క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లెట్‌ బండి కోసం.. అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేశాడు.. తర్వాత..

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??

పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..

కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu