కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

Phani CH

|

Updated on: Sep 01, 2022 | 9:44 AM

దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తున్నారంటే.. దాని ద్వారా ఎంత సొమ్ము చేసుకుంటున్నారో అర్థమవుతుంది.

దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రాణాలకు తెగించి మరీ స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తున్నారంటే.. దాని ద్వారా ఎంత సొమ్ము చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇంతలా మన కంట్రీలోకి డ్రగ్స్ రవాణా జరగడాన్ని ప్రమాద ఘంటికగానే చూడాలి. యువత ఏ రేంజ్‌లో డ్రగ్స్ బారిన పడిందో.. వారిని బయటపడేయటం ఎలా అన్న మార్గాలపై ఫోకస్ పెట్టాలి. తాజాగా ఓ ఫారెనర్ ఇండియాలోకి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేసేందుకు యత్నించి.. నాటకీయ పరిస్థితుల్లో అడ్డంగా బుక్కయ్యాడు. బ్రెజిల్ నుంచి 31 ఏళ్ల పాల్ సీజర్ అనే పేరు గల​ ప్యాసింజర్ కోల్​కతాకు వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు రాగానే అతడికి కడుపు నొప్పి స్టార్టయ్యింది. క్రమంగా నొప్పి పెరగడంతో.. తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీలయ్యింది. స్కానింగ్ రిపోర్ట్‌లో అతని కడుపులో డ్రగ్ ట్యాబ్లెట్స్ ఉన్నట్లు తేలింది. మొత్తం 44 మాత్రలు అతని కడుపు నుంచి వెలికితీసారు. ఆ డ్రగ్ కొకైన్ అని తేల్చారు. ఒక్కో ట్యాబ్లెట్ బరువు 14 గ్రాములు ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. మాదక ద్రవ్యాలు ఎక్కడ నుంచి తరలిస్తున్నాడనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్

Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో

కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??

మొసళ్ల నదిలో పడిపోయిన బాలుడు !! ప్రాణ భయంతో పోరాడుతూ..

నెలరోజులగా తాటిచెట్టుపైనే !! ఆహారం, కాలకృత్యాలు అన్నీ అక్కడే !!

Published on: Sep 01, 2022 09:44 AM