చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన బాలుడు.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Sep 01, 2022 | 9:48 AM

ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రోడ్డుపై లేదా రోడ్డు పక్కన నిలబడి ఉండే ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రోడ్డుపై లేదా రోడ్డు పక్కన నిలబడి ఉండే ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బాలుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే ఆ బాలుడు అక్కడే ఉండి ఉంటే కచ్చితంగా అతని ప్రాణాలు మిగిలేవి కావనే విషయం అర్థమవుతోంది. ఒక్క సెకను ఆలస్యమైతే భారీ నష్టం జరిగేది. వీడియోలో ఒక బాలుడు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రెయిలింగ్‌ను పట్టుకొని నిల్చున్నాడు. కొంత సమయం తర్వాత అతను అక్కడి నుంచి కాస్త పక్కకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అంతే కాకుండా రెయిలింగ్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో హ్యాండ్‌రైల్, కారు ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్దీ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలంలో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న మహిళ.. ఇంతలో..

కడుపులో విపరీతమైన నొప్పి !! స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్

నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ సింక్‌హోల్.. కళ్లముందే అలా జరగడంతో వాహనదారులు షాక్

Viral: గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న మేక పిల్ల.. వైరలవుతున్న వీడియో

కుక్క కోసం పసివాడి ప్రాణాలను వదిలేశాడు !! చివరకు ఏమైందంటే ??

 

Published on: Sep 01, 2022 09:48 AM