తాటి చెట్టు పైకి గీత కార్మికుడు కుండలో కనిపించింది చూసి షాక్

Updated on: Mar 02, 2025 | 7:16 PM

తాటిచెట్ల నుంచి తీసిన దాన్ని తాటికల్లు అంటారు. ఈత చెట్ల నుంచి తీసిన దాన్ని ఈత కల్లు అంటారు. తెలుగు రాష్ట్రాల్లో కల్లుకు డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా తెలంగాణలో కల్లు అంటే ఓ ఎమోషన్. ఓ గౌడ సోదరుడు రోజూలానే చెట్టు పైన ఉన్న కల్లు దించేందుకు వెళ్లాడు. కానీ ఈ సారి అతనికి ఊహించని అతిథి దర్శనమిచ్చింది. దాన్ని చూసి ఆ గౌడన్న ఆశ్చర్యపోయాడు. ఈ క్రేజీ వీడియో వైరలవుతోంది.

ఇందులో ఓ గీత కార్మికుడు కల్లు కుండ దించేందుకు తాటి చెట్టు పైకి ఎక్కాడు. ఒక కుండ నుంచి కల్లు దింపేందుకు ప్రయత్నించాడు. అయితే అందులో అనూహ్య రీతిలో ఓ అనుకోని అతిథి దర్శనిచ్చింది. దీంతో అవాక్కవ్వడం ఆ గీత కార్మికుడి వంతైంది. ఇంతకీ ఆ అతిథి ఎవరు అనకుంటున్నారా…? ఉడుము.. అవును ఆ కుండలో ఓ ఉడుము ఉంది. ఉడుములు తాటి చెట్లు ఎక్కి కుండల్లోని కల్లు తాగుతాయని పలువురు గౌడ సోదరులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతాయ్ అంటున్నారు. కాగా ఈ వీడియోకు నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెండ్స్ పెడుతున్నారు. కల్లు పోతే పోయింది.. కూర వండేందుకు మంచి ఉడుము దొరికిందిగా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే ఉడుమును చంపి తినడం నేరం. ఉడుములు కూడా పులులు, నెమళ్ల జాబితాలోని షెడ్యూల్ వన్ కేటగిరీలోకి చేరాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతుండడం, వన్యప్రాణుల వేట పెరిగిపోతున్న నేపథ్యంలో.. వారి పరిరక్షణ కోసం అటవీ చట్టాలు మరింత కఠినతరం చేశారన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణుల్ని చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై సంతోషంతో ఫోటోలకు ఫోజులిచ్చిన వరుడు.. ఇంతలో

బాబోయ్.. నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయి

మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్‌ ఐబ్రోస్‌, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు

రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??

నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్‌ !!