అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్‌ ??

|

Dec 09, 2024 | 9:17 PM

హల్వా స్వీట్‌ను ఒక్కో చోట ఒక్కో రకంలో తయారు చేస్తారు. అయితే కేరళ హల్వా దేశవ్యాప్తంగా ఫేమస్. హల్వాని తలచుకున్నా, చూసినా వెంటనే నోటిలో నీళ్లు ఊరుతాయి. హల్వా కూడా సీజన్ ప్రకారం తయారు చేసి తింటారు. ఈ తీపి వంటకాన్ని ఏడాది పొడవునా తయారు చేసుకుని తినవచ్చు. క్యారెట్ హల్వా, బీట్ రూట్ హల్వా, కేసరి హల్వా, బాదం హల్వా వంటి రకరకాల హల్వాలను రుచి చూసి ఉంటారు.

అయితే మీరు ఎప్పుడైనా మిరపకాయ హల్వా తిన్నారా? కాకపోతే ప్రస్తుతం మిర్చి హల్వా చాలా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆహార పదార్థాలతో ఎన్నో ప్రయోగాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ముందుకు వచ్చిన ఈ హల్వా ప్రయోగాన్ని చూసిన జనం షాక్ తింటున్నారు. మిర్చితో హల్వా తయారు చేస్తున్న వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలొ హల్వా ఎలా తయారుచేయాలో చూపించారు. ముందుగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టారు. దాని తరువాత, మిరపకాయలను ఒక పాన్‌లో వేసి దానికి రుచికి సరిపడా చక్కెర, ఆకుపచ్చ రంగు, పాలు, నెయ్యి, జీడిపప్పు వేసి కలిపారు. ఇవన్నీ కలిపిన తర్వాత హల్వాని ఉడికించారు. హల్వా రెడీ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న హల్వా అచ్చులో వేసి.. అరబెట్టారు. బర్ఫీలా రెడీ అయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.కోటి జీతాన్ని వదులుకుని.. ఐఏఎస్‌లో చేరి !!

అసలే చలికాలం.. ఆపై జ్వరాలు.. మరి జాగ్రత్తలేంటి ??

PV Sindhu: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధు

సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే

TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1