Viral Video: అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌ ఎక్స్‌ప్రెస్, పద్మావతీ ఎక్స్‌ప్రెస్‌

Viral Video: అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌ ఎక్స్‌ప్రెస్, పద్మావతీ ఎక్స్‌ప్రెస్‌

Anil kumar poka

|

Updated on: Jun 15, 2024 | 7:39 PM

ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో దొంగలు పడి బంగారం క్యాష్‌ దోచుకుపోయారు. మచిలీపట్నం నుంచి బీదర్‌ వెళ్తున్న బీదర్‌ ఎక్స్‌ప్రెస్ అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. దుండగులు నాగులవంచ-చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసి రెండు రైళ్లను ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో దొంగలు పడి బంగారం క్యాష్‌ దోచుకుపోయారు. మచిలీపట్నం నుంచి బీదర్‌ వెళ్తున్న బీదర్‌ ఎక్స్‌ప్రెస్ అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. దుండగులు నాగులవంచ-చింతకాని మధ్య ఉన్న సిగ్నలింగ్‌ వ్యవస్థను ట్యాంపరింగ్‌ చేసి రెండు రైళ్లను ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చిన బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపి నాలుగు రిజర్వేషన్‌ బోగీల్లోకి చొరబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్‌సిగ్నల్‌ పడటంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్లింది.

రాత్రి ఒంటిగంట సమీపంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతీ ఎక్స్‌ప్రెస్‌ను సైతం దుండగులు అదే ప్రాంతంలో ఆపారు. అయిదారుగురు దొంగలు కలిసి గాఢనిద్రలో ఉన్న పద్మావతి, వర్ధనమ్మ, వి.కుమార్‌ ఇతర ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, మరికొందరి నుంచి క్యాష్‌ ఎత్తుకెళ్లిపోయారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, 20 వేల రూపాయల నగదు అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకుని ఆ కేసును ఖమ్మంకు బదిలీ చేసినట్లు సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్పీ సందర్శించారు. వేలిముద్రల నిపుణుల సహాయంతో వేలిముద్రలు సేకరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.