Metro Train Collision: మంచు ఎఫెక్ట్.. రెండు మెట్రో రైళ్లు ఢీ.! 515 మందికి గాయాలు..

|

Dec 20, 2023 | 7:03 PM

చైనా రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 515 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 102 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఇప్పటికే నాలుగు వందల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు ప్రకటించారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగిందన్నారు. మంచు కారణంగా జారుతున్న ట్రాక్‌లపై సరిగ్గా బ్రేకులు పడకపోవడం వల్ల రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్నాయని చెప్పారు.

చైనా రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 515 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 102 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఇప్పటికే నాలుగు వందల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు ప్రకటించారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగిందన్నారు. మంచు కారణంగా జారుతున్న ట్రాక్‌లపై సరిగ్గా బ్రేకులు పడకపోవడం వల్ల రెండు మెట్రో రైళ్లు ఢీ కొన్నాయని చెప్పారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు బీజింగ్‌ రవాణా అధికారులు వెల్లడించారు. ప్రపంచంలో అత్యంత బిజీ మెట్రో రైల్‌ వ్యవస్థలో బీజింగ్‌ ఒకటి. ఇక్కడ 27 మార్గాల్లో నిత్యం 1.30కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. రద్దీ సమయంలో నిమిషానికొక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. అయితే, కొన్ని రోజులుగా అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో స్కూళ్లను అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో పౌరులు ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మూడు రోజులుగా అక్కడి మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.