అప్పుడే మార్కెట్‌లోకి మామిడి పండ్లు.. కిలో ఎంతో తెలుసా వీడియో

Updated on: Mar 04, 2025 | 6:51 PM

పండ్లలో ఎన్నిరకాలు ఉన్నా.. మామిడి పండు ప్రత్యేకతే వేరు. అందుకే దీనిని ఫలరాజం అంటారు. ప్రతి ఏటా సమ్మర్‌లో అద్భుతమైన రుచితో మామిడి ప్రియుల మనసు దోచుకుంటాయి మామిడిపండ్లు. అయితే ఈ ఏడాది సీజన్‌కి కాస్త ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్‌లో అప్పుడే మామిడి పండ్ల సీజన్ మొదలైపోయింది. ఫిబ్రవరి మొదటి వారం నుండే మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చేసాయి. కాస్త ముందుగా రావడంతో ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో కిలో 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో కిలో వంద రూపాయలు అమ్ముతున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్‌లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువ గానే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే బాట సింగారం మార్కెట్‌కు 1,470 క్వింటాళ్ల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.

గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని వ్యాపారులు అంటున్నారు.అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవడంతో మామిడి చెట్లకు నష్టం బాగా జరిగిందని.. అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు అంటున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని అంటున్నారు. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి దాదాపు 2 వేల టన్నుల మామిడి మార్కెట్‌కు దిగుమతి కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 4 వేల టన్నుల వరకు వచ్చింది. మార్చి రెండు, మూడో వారానికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి పండ్లు మార్కెట్‌కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.

మరిన్ని వీడియోల కోసం :

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో

అక్బర్‌ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో