Train Moved on Man: వామ్మో..! ఒక్కసారిగా కదిలిన ట్రైన్‌.. వెన్నులో వణుకు పుట్టే దృశ్యం..!

Train Moved on Man: వామ్మో..! ఒక్కసారిగా కదిలిన ట్రైన్‌.. వెన్నులో వణుకు పుట్టే దృశ్యం..!

Anil kumar poka

|

Updated on: Nov 14, 2022 | 8:50 AM

ఇటీవల రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రైలు కిందపడి నిత్యం వందలాది మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో కొందరు అత్యుత్సాహంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.


తాజాగా ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాలే పోయినంత పనైంది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భాగల్‌పూర్‌ స్టేషన్‌లో పట్టాలపై గూడ్స్‌ రైలు ఆగి ఉంది. స్టేషన్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలనుకున్నాడు. అందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ షార్ట్‌కర్ట్‌ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే, పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్‌ కదిలింది. దీంతో ఆ వ్యక్తి రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి రైలు కింద పట్టాల మధ్య అలాగే పడుకొని ఉండిపోయాడు. ట్రైన్‌ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన భయంతో వణికిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు. రైలు పూర్తిగా వెళ్లిన తర్వాత అదృష్టం బాగుండి ఎలాంటి గాయం లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. రైలు వెళ్లగానే లేచి తన బ్యాగ్‌ సర్ధుకుని అక్కడి నుంచి తాఫీగా జారుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాయి. అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు పాటించని సదరు వ్యక్తిని అరెస్ఠ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..