Prayers for dead body: ఇంట్లో నుంచి దుర్వాసన.. ఏంటని చూస్తే గుండెలు గుభేల్..! చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తందంటూ..

Prayers for dead body: ఇంట్లో నుంచి దుర్వాసన.. ఏంటని చూస్తే గుండెలు గుభేల్..! చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తందంటూ..

Anil kumar poka

|

Updated on: Nov 14, 2022 | 8:36 AM

మనిషి జీవితంలో పుట్టుక తప్పదు.. చావు తప్పదు. ఎప్పటికైనా అది రావాల్సిందే. అది వచ్చిన రోజు అన్ని బంధాలను పుటుక్కుమని తెంపేసి నిర్దాక్షిణ్యంగా తనతో పాటు తీసుకెళ్లిపోతుంది.


మనిషి జీవితంలో పుట్టుక తప్పదు.. చావు తప్పదు. ఎప్పటికైనా అది రావాల్సిందే. అది వచ్చిన రోజు అన్ని బంధాలను పుటుక్కుమని తెంపేసి నిర్దాక్షిణ్యంగా తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. కానీ ఆప్తులపై ఏర్పడిన ప్రేమ ఊరుకుంటుందా. ఇష్టమైన వారు దూరమయ్యారనే బాధ ఎంతటి పని చేసేందుకైనా వెనకాడదు అనే దానికి ఉదాహరణే ఈ ఇన్సిడెంట్. తమిళనాడులోని మదురైలో ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఎస్‌ కాలనీలో బాలకృష్ణన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి భార్య మాలతి, ఇద్దరు కుమారులు సంతానం. బాలకృష్ణన్‌ ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మేనేజర్‌‌గా పని చేస్తుండగా.. కుమారులిద్దరూ వైద్య విద్య చదువుతున్నారు. ఈ క్రమంలో మాలతి నవంబర్ 8న అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ పెద్దగా, తల్లిగా, భార్యగా ప్రేమానురాగాలు కురిపించిన వ్యక్తి.. ఇకలేరనే చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను ఎలాగైనా తిరిగి బతికించుకోవాలని ఆశపడ్డారు. ఆమె మృతదేహం వద్ద ప్రార్థనలు చేశారు. రోజులు గడుస్తున్నా ఆమె తిరిగి రాలేదు కానీ.. వారి ఇంటి ముందు జనాలు గుమిగూడారు. దుర్వాసన వస్తోందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నమిత్తం తరలించారు. కాగా,మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ప్రార్థనలు చేస్తుండటం వారిని విస్తుగొలిపింది. ఇలా ప్రార్థనలు చేస్తే మాలతి తిరిగి ప్రాణాలతో వస్తుందని వారు స్థానికులకు చెప్పడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 14, 2022 08:36 AM